ప్రపంచంలో ప్లాస్టిక్ లేని చోటు లేదు. బిలియన్లకు పైగా ప్లాస్టిక్ వస్తువులు మన సముద్రాలు, నదులు, చెరువుల్లోనే కాదు, గాలిలోను, భూమిలోనూ చేరి వృక్షాలకు, పక్షులకు, జలచరాలకు, ఉభయచరాలకు ఆఖరకు మనుషులకు సైతం తీవ్ర హాని కలిగిస్తున్నాయని ఆరోగ్యశాస్త్ర నిపుణులు అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని వాస్తవాలు వింటే మనకు నిజంగానే భయమేస్తుంది. 'ప్లాస్టిక్ నిషేధం' విస్తృతంగా అమలవుతున్న ఈ తరుణంలో నానోప్లాస్టిక్ రేణువులు తెస్తున్న ముప్పు గురించిన కథనం చదువండి. అంతర్జాతీయంగా 192 దేశాల్లో ప్రతి ఏడాది 27.5 కోట్ల టన్నుల ప్లాస్టిక్ కాలుష్యం వెలువడుతున్నట్టు అంచ నా. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నిమిషానికి 10 లక్షల ప్లాస్టిక్ సంచులు ఏదో రూపంలో ప్రజల వాడకంలోకి వెళుతున్నాయి. మనం వాడే ప్లాస్టిక్ వస్తువులను నెమరు వేసుకొంటే తత్ పర్యవసానాలు ఆందోళన కలిగిస్తయి. ఒక్క రోజులోనే అర్ధ బిలియన్ (50 కోట్లు) ప్లాస్టిక్ స్ట్రాలు, 500 బిలియన్ ప్లాస్టిక్ కప్పులు సంవత్సర కాలంలో వినియోగమవుతున్నట్టు అంచనా. అలాగే, 16 బిలియన్‌ల డిస్పొజేబుల్ కాఫీ కప్పులు, 14 మిలియన్ యుఎస్ టన్నుల పాలిస్టర్‌ను, ప్రపంచమంతా 4.5 ట్రిలియన్ సిగరెట్లను వాడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోని వివిధ దేశాలలో ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొడుతున్నారు. మన దేశమూ, తెలుగు రాష్ర్టాలూ ఇదే పంథాలో అత్యంత నిర్దాక్షిణ్యంగా, కఠినంగా వివిధ ప్లాస్టిక్ నిషేధ చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత చాలా ఉన్నది. మానవ జీవితంలో ప్లాస్టిక్ ఎంతగా భాగమైపోయిందంటే, అది ఆహార పదార్థాలు, నీరు, గాలితోపాటు కలిసిపోయి, మన కడుపుల్లోకి సైతం చేరుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. కాకపోతే, అదంతా పరమాణువు స్థాయి (నానోపార్టికల్స్)లో జరుగుతుండడం వల్లే మన దృష్టికి రాలేకపోతున్నట్టు వారు అంటున్నారు. ఏ ప్లాస్టిక్ అయితే సూర్యరశ్మికి, వేడిమికి కరిగి పోయి, అతిసూక్ష్మ కణాలుగా మిగిలిపోతుందో ఆ 'నానో ప్లాస్టిక్ భూతం' గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. ఇలా అణువుల తునకలుగా మారిన ప్లాస్టిక్ సముద్రాలు, నదులు, సరస్సులు, నీటికాల్వల్లో కలిసి పోతున్నది. మెల్లిగా అవే ప్లాస్టిక్ సూక్ష్మాణువులు మరింత సూక్ష్మస్థాయిలోకి బదిలీ అయి సముద్రజీవుల్లోకి చేరుతున్నాయని వారు అంటున్నారు. ప్లాస్టిక్ రేణువులు 150 మైక్రాన్లకన్నా చిన్న పరిమాణానికి పడిపోయిన ఫలితంగానే నీరు, గాలి, ఆహార పదార్థాలలోకి చేరి, తర్వాత వాటిద్వారా జంతుజాతులు, మానవుల శరీరాలలోకి చేరుతున్నాయి. ప్లాస్టిక్ రేణువుల పరిమాణం 1-100 నానోమీటర్ (అంతర్జాతీయ కొలతల ప్రమాణం ప్రకారం 1 బిలియన్‌లో 1 వంతు. దీనినిబట్టి 1 నానోమీటరు అంటే 1 మీటరులో ఒక బిలియన్ వంతు సూక్ష్మపరిమాణం. ఉదా॥కు ఒక పేపర్ మందం 1,00,000 నానోమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. దీన్నిబట్టి నానోమీటర్ మందం ఎంత సూక్ష్మమో అర్థం చేసుకోవచ్చు)ల మధ్య ఉంటుం ప్రత్యేకించి భారతీయులు ప్రతి సంవత్సరం వివిధ రూపాలలో 11 కేజీల నానోప్లాస్టిక్‌లను తింటున్నట్లు పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కొన్ని అధ్యయనాలైతే మనల్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అతిసూక్ష్మ (నానో) ప్లాస్టిక్ రేణువులు వారానికి 5 గ్రాములు, నెల రోజుల్లో పావు కిలో చొప్పున మన శరీరంలో కలుస్తున్నట్టు అంచనా. నిత్యం మనలో చాలా మందిమి వాడే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్లు సూర్యరశ్మి తాకిడికి లోనవుతూ ఉంటాయి. వాటిలో నీటిని రోజుల తరబడి నిలువ వుంచుతూ, అవసరాన్నిబట్టి ప్రజలకు చేరవేస్తుంటారు. వేడిమి కారణంగా పాలిథిన్ వాటర్ క్యాన్లు, వాటర్ బాటిల్స్ నుండి అతిసూక్ష్మ నిష్పత్తిలో ప్లాస్టిక్ కణాలు విడుదలై నీళ్లలో కలుస్తున్నట్టు పరిశోధనాత్మకంగా నిరూపితమైంది. ఇక, బయటి వాతావరణంలోని జలాశయాల (water bodies) ల పరిస్థితి మరింత అధ్వాన్నం. ఆ నీళ్లలో అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలు మరింత పెద్ద మొత్తంలో చేరుకుంటున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. అటువంటి నీటిని నేరుగానో లేదా మరో రూపంలో కానీ తాగడం వల్ల ప్లాస్టిక్ కడుపులోకి చేరే ప్రమాదం పెద్ద ఎత్తున ఉన్నట్టు నిపుణులు అంటున్నారు. ఈ ప్లాస్టిక్ కణాలను కలిగి వున్న జలాశయాల్లోని చేపలు, రొయ్యలు వంటివాటిని మనుషులు తింటుంటారు. అలాగే, దుమ్ము ధూళిద్వారా 13 నుంచి 70 వేల వరకు ప్లాస్టిక్ అణువులను మనం ప్రతి ఏటా పీల్చేస్తున్నామని వారి అంచనా. వాహనాల టైర్లద్వారా కూడా రహదారుల వాతావరణంలోకి ప్లాస్టిక్ విడుదలవుతున్నది. ఈ రకమైన వివిధ ప్లాస్టిక్ అణువులు గాలిలో కలుస్తుంటాయి. కారు డోరులో ప్లాస్టిక్ బాటిల్‌ను పెట్టుకొని, వేడికి ఎక్కువగా గురైన తర్వాత అదే నీటిని తాగే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. బాహ్య ప్రాంతాలలోని తాగునీరు, సముద్ర ఉప్పులో నానో ప్లాస్టిక్ రేణువులు ఉంటున్నట్టు చెబుతున్నారు. అలాగే, స్కర్బ్స్, లిప్‌స్టిక్స్, షాంపూలు వంటివాటి ద్వారా కూడా అవి మన శరీర భాగాల్లోకి చేరుతున్నాయి. ట్యాప్ (నల్లా), వాటర్ బాటిళ్లలో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉంటున్నట్టు పలు ప్రయోగాలలో నిరూపితమైంది. శరీరంలోకి చేరిన ఈ రేణువులు విసర్జన రూపంలో బయటకు పోవాలి. పోవచ్చు కూడా. పోకుండా మిగిలినవి కడుపులో, పొట్టపేగులలో చేరి అంతర అవయవాలకు, కణజాలానికి నష్టం కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ మొత్తంలో నష్టదాయక రసాయనం 'బీపీఏ' (bisphenol A) పలువురి మూత్రంలో ఉంటున్నట్టు కూడా వారు చెబుతున్నారు. ఇవే ప్లాస్టిక్ రేణువులు నరాలలోకి, హార్మోన్లలోకి, రోగనిరోధక వ్యవస్థలోకి చేరుతున్నాయని, ఫలితంగా పలు రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని కూడా వారన్నారు. శరీరంలోని ప్రొటీన్ (మాంసకృత్తు)ల చుట్టూ ప్లాస్టిక్ అతిసూక్ష్మ అణువులు చేరినప్పుడు అవి 'ప్లాస్టిక్ ప్రొటీన్' సమూహ పదార్థాలుగా మారి, ఆరోగ్యానికి తీవ్రహాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ ప్రొటీన్లు, అతిసూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు రక్తంలోని తెల్ల రక్తకణాలతో చర్య జరపడం కూడా హానికరమే. ఒక్కోసారి ఇవి తెల్లరక్త కణాల నాశనానికి కారణమవుతాయని కూడా ఆరోగ్యవేత్తలు అంటున్నారు. వాతావరణంలో నానోప్లాస్టిక్ ఎంత మొత్తంలో ఉంటున్నదో మనలో చాలామందికి తెలియదు. పరిశోధకుల ప్రయోగాలలో అనేక ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. నానోప్లాస్టిక్, ప్లాస్మా మధ్య జరిగే చర్యలపైనా లోతైన పరిశోధనలు జరిగాయి. రక్త ప్రొటీన్లు (ఉదా॥కు ఆల్బుమిన్లు (Albumin), గ్లోబులిన్స్ (globulins), ఫెబ్రినొజెన్స్ (Fibrinogen)లు) మన శరీరంలో ఆస్మాటిక్ ప్రెజర్ (Osmotic pressure), మాలెక్యులర్ సరఫరా, బ్లెడ్ కొయాగులేషన్ (Blood Coagulation), ఇమ్యూన్ బాధ్యతలను శోషించుకునేలా చేసి ప్లాస్టిక్ ప్రొటీన్ కాంప్లెక్స్‌లుగా మారుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వాటి పరిమాణం 13 నుంచి 600 నానోమీటర్లుగా ఉంటున్నట్టు చెబుతున్నారు. దీనివల్ల రక్త ప్రవాహానికి అడ్డుకట్ట పడినట్టవుతుందని వారంటున్నారు.
భారత సర్కారుతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశాలలో ఎక్కడా వాటర్ బాటిళ్ల వాడకం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు పడుతున్నారు. ఇదే సమయంలో మనం కడుపులోకి తీసుకొనే ప్రతీ ఆహార పదార్థాన్ని సాధ్యమైనంత వరకు 'నానో ప్లాస్టిక్ రేణువుల రహితం'గా చూసుకోవలసిన అవసరం, బాధ్యతా చాలా ఉన్నది. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు రాగి, గాజు గ్లాసులను వాడడం ఎంతో మంచిది. ఈ నానో ప్లాస్టిక్ భూతం వల్ల మున్ముందు మరెన్నో ఘోరాలు వినవలసి రావచ్చునని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడెబుల్ (జీవ శైథిల్య), గాజు, కాటన్, పసుపు, తోలు, ఫైబర్, మిల్క్ ప్రొటీన్లతో తయారైన వస్తువులు, కలబంద, చికెన్ ఫెదర్స్, గోధుమ, షుగర్ కేన్, చెక్క, బంగాళాదుంపలతో తయారైన వస్తువులను చక్కగా వాడవచ్చునని వారు సూచిస్తున్నారు.
తక్షణం స్వస్తి చెబుదాం!
భారత సర్కారుతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వ ఉన్నత స్థాయి సమావేశాలలో ఎక్కడా వాటర్ బాటిళ్ల వాడకం లేకుండా అధికారులు తగు జాగ్రత్తలు పడుతున్నారు. ఇదే సమయంలో మనం కడుపులోకి తీసుకొనే ప్రతీ ఆహార పదార్థాన్ని సాధ్యమైనంత వరకు 'నానో ప్లాస్టిక్ రేణువుల రహితం'గా చూసుకోవలసిన అవసరం, బాధ్యతా చాలా ఉన్నది. ప్లాస్టిక్ బాటిళ్లకు బదులు రాగి, గాజు గ్లాసులను వాడడం ఎంతో మంచిది. ఈ నానో ప్లాస్టిక్ భూతం వల్ల మున్ముందు మరెన్నో ఘోరాలు వినవలసి రావచ్చునని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడెబుల్ (జీవ శైథిల్య), గాజు, కాటన్, పసుపు, తోలు, ఫైబర్, మిల్క్ ప్రొటీన్లతో తయారైన వస్తువులు, కలబంద, చికెన్ ఫెదర్స్, గోధుమ, షుగర్ కేన్, చెక్క, బంగాళాదుంపలతో తయారైన వస్తువులను చక్కగా వాడవచ్చునని వారు సూచిస్తున్నారు.