రామగుండం ట్రాఫిక్ ఏసీపీగా - పసల బాలరాజు

 రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో 1991వ సంవత్సరం లో ఎస్సై గా డిపార్ట్మెంట్ లోకి వచ్చిన పసల బాలరాజు ఎస్సై గా, ఇన్స్పెక్టర్ గా మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ సీఐ గా వివిధ పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహించి , డిఎస్పీ గా పదోన్నతి పై అసిఫాబాద్ లో  కొంతకాలం సేవలు అందించి, అక్కడి నుండి బదిలీ పై తెలంగాణ లొనే ప్రతిష్టాత్మక విద్యాలయం  IIIT బాసర లో సంవత్సరంనర పాటుగా సేవలు అందించారు. బాసర నుండి బదిలీ పై రామగుండం ట్రాఫిక్ ఏసీపీ గా బాలరాజు గారు ఈ రోజు తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు గారి తో పాటుగా పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఉపేందర్, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు మరియు ట్రాఫిక్ సిబ్బంది ఏసీపీ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేసి అభినందనలు తెలిపారు.



పవర్ ఆఫ్ పోలీస్ మ్యాగజైన్ 

✍🏻 రిపోర్టర్  -  యం. వంశీకృష్ణ.. ✍🏻