కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : కాగజ్ నగర్ గ్రామీణ సాంకేతిక నిధులు కొరత తదితర కారణాలతో నిలిచిన చింతగూడ కోయవాగు వంతెన పనులు పునఃప్రారంభమాయ్యాయి. టయూఎఫ్ ఐడీసీ కింద రూ 4.50 కోట్లతో చింతగూడ కోయవాగు వంతెన నిర్మాణానికి మంజూరు కాగా 2018 ఆగస్టు 2న మంత్రి కేటీఆర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. పిల్లర్ల నిర్మాణాలు పూర్తి చేసిన గుత్తేదారు ఏడాది క్రితం పనులను నిలిపివేశారు. నిధులు విడుదలలో జాప్యం, సాంకేతిక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వంతెన పనులు దాదాపు పూర్తి కాగా, ప్రస్తుతం అప్రోచ్ రహదారి పనులు సాగుతున్నాయి. ఈ మేరకు 2021 జనవరిలోపు పనులను పూర్తి చేసి, వంతెన పనులను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే వంతెన పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అర్ అండ్ బీ డీఈ లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు..
పవర్ ఆఫ్ పోలీస్ మ్యాగజైన్
✍🏻 రిపోర్టర్ - యం. వంశీకృష్ణ. ✍🏻
కుమరంభీమ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా